ఒకేసారి దాడి చేసిన 40 మొసళ్లు..వృద్ధుడి దారుణ మరణం

27-05-2023 Sat 09:49 | Offbeat
Advertisement
  • కాంబోడియాలో దారుణ ఘటన
  • మొసళ్ల పెంపకం చేపట్టిన వ్యక్తి
  • ఓ మొసలి గుడ్లు పెట్టడంతో వాటిని సేకరించేందుకు ప్రయత్నం
  • మొసలిని కర్రతో పక్కకు తోసే క్రమంలో బోనులో పడ్డ వృద్ధుడు
  • బోనులో 40 మొసళ్లు ఒక్కసారిగా దాడి చేయడంతో దారుణ మరణం
Advertisement
నలభై మొసళ్లు ఒకేసారి దాడిచేయడంతో ఓ వృద్ధుడు నరకయాతన అనుభవించి మరణించాడు. కాంబోడియా దేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం, సియెమ్ రీప్ ప్రాంతంలో 75 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మొసళ్లను పెంచుతుంటాడు. ఇటీవల వాటిల్లో ఒకటి గుడ్లు పెట్టడంతో దాన్ని కర్రతో పక్కకు తోలి గుడ్లు తీసుకునేందుకు ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో మొసలి వృద్ధుడి చేతిలోని కర్రను పట్టిలాగడంతో ఆయన బోనులో పడిపోయాడు. దీంతో, అక్కడ ఉన్న మొసళ్లన్నీ ఒక్కసారిగా ఆయనపై దాడి చేశాయి. శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ మేరకు స్థానిక పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, సియేమ్ రీప్ ప్రాంతం మొసళ్ల పెంపకానికి ప్రసిద్ధి. మొసళ్ల గుడ్లు, చర్మం, మాంసం కోసం స్థానికులు వీటిని భారీ సంఖ్యలో పెంచుతుంటారు.
Advertisement
Cambodia

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more